ETV Bharat / bharat

a Lover Cut her young woman Throat : ఉప్పల్‌లో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది - Uppal Latest Crime News

hyd
hyd
author img

By

Published : Jul 24, 2023, 7:41 PM IST

Updated : Jul 24, 2023, 8:04 PM IST

19:03 July 24

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి

నిందితుడు లక్ష్మీనారాయణ
నిందితుడు లక్ష్మీనారాయణ

a Lover Cut her young woman Throat at Hyderabad : సమాజంలో రోజురోజుకు మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆడవారు కనిపిస్తే చాలు.. క్రూరమృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు కొందరు. వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నవారు మరికొందరు. ప్రేమిస్తున్నామని వెంటపడి మోసం చేసేవారు కొందరు. ఆ ప్రేమను కాదంటే కాలయములుగా మారి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

Hyderabad Latest Crime News : ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హబ్సిగూడకు లక్ష్మీనారాయణకు గతంలోనే వివాహం అయింది. ఈ క్రమంలోనే రామంతాపూర్‌లో నివాసం ఉంటున్న బంధువైన యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక.. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు అతడిని మందలించారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం.. లక్ష్మీనారాయణ మాట్లాడుకుందామని‌ కారులో యువతిని ఎక్కించుకొని ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లే అవుట్‌కు వచ్చాడు.

ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి గురైన లక్ష్మీనారాయణ.. బ్లేడుతో యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారీ అయ్యాడు. వెంటనే స్థానికులు స్పందించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పథకం ప్రకారమే యువతిపై దాడి చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి : అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

Last Updated : Jul 24, 2023, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.