ETV Bharat / bharat

A Lover Attack on Young Woman With Knife : ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి.. తమ్ముడి మృతి, అక్కకు తీవ్ర గాయాలు - LBnagar latest news

A young man attacked two people
Lover Attack on Young Woman
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 4:49 PM IST

Updated : Sep 3, 2023, 9:18 PM IST

16:43 September 03

A Lover Attack on Young Woman With Knife : ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి.. తమ్ముడి మృతి, అక్కకు తీవ్ర గాయాలు

A Lover Attack on Young Woman With Knife ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి తమ్ముడి మృతి అక్కకు తీవ్ర గాయాలు

A Lover Attack on Young Woman With Knife in LB Nagar : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పృథ్వీ అనే బీటెక్‌ చదువుతున్న యువకుడు మృత్యువాతపడ్డాడు. స్థానికంగా నివాసం ఉంటున్న అక్క, తమ్ముడి ఇంట్లోకి చొరబడ్డ శివకుమార్‌.. మాటామాటా పెరిగి వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడికి తెగబడ్డాడు. తొలుత అక్క ముఖం, చేతులపై కత్తితో(A Lover Attack on Young Woman With Knife) దాడికి పాల్పడ్డాడు.

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని కారుతో ఢీకొట్టి

ఆ సమయంలో అడ్డుకోవడానికి వెళ్లిన తమ్ముడు పృథ్వీ అలియాస్‌ చింటూపై.. శివకుమార్ విరుచుకుపడ్డాడు. పృథ్వీ ఛాతీపై బలంగా కత్తితో పొడవడం వల్ల తీవ్ర రక్తస్రావమైంది. ఆ పెనుగులాటలో ఇంట్లోని కిటికీ అద్దాలు పగిలిన శబ్దంతో పాటు.. అక్క, తమ్ముడు అరుపులు విని పొరుగింటి వారు అక్కడికి చేరుకున్నారు. కర్రలతో వచ్చిన స్థానికులు నిందితుడిని పట్టుకుని అదే ఇంట్లో తలుపులకు తాళం వేసి బంధించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

ఈ క్రమంలోనే తీవ్ర గాయాలపాలైన అక్క, తమ్ముడిని.. సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న పృథ్వీ పరిస్థితి విషమంగా మారి మృతి చెందాడు. పోలీసులు నిందితుడు శివకుమార్‌ను పట్టుకుని ఎల్బీనగర్‌ పోలీస్​స్టేషన్‌కు తరలించారు. అక్క ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ పరిశీలించారు. శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నామని తెలిపారు. బాధిత యువతిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు. నిందితుడిని పూర్తిస్థాయిలో విచారణ చేస్తేనే.. పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు వెల్లడించారు.

"దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. గాయపడిన చింటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కత్తిపోట్లకు గురైన యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించాం. నిందితుడు శివకుమార్‌ను విచారిస్తే దాడికి కారణం తెలుస్తుంది." - సాయిశ్రీ, ఎల్బీనగర్‌ డీసీపీ

A Lover Attacked With Knife Young Woman in Jagathgirigutta : రెండు రోజుల క్రితమే జగద్గిరిగుట్టలో (Jagathgirigutta) ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై నాగరాజు అనే ప్రేమోన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి మెడ, వీపుపై పొడిచాడు. అనంతరం నాగరాజు.. కత్తితో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలోనే నాగరాజును అడ్డుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ప్రైవేట్ పాఠశాలలో టీచరుగా పని చేస్తుందని తెలిపారు. నిందితుడు నాగరాజు ఎలక్ట్రీషియన్​గా పని చేస్తున్నాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వివరించారు.

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?

యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

Last Updated : Sep 3, 2023, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.