Cobra Swallowed a Python: చిన్నచిన్న జంతువులను కూడా మింగేయగల కొండ చిలువను పొట్టనపెట్టుకుంది ఓ కోబ్రా. ఈ ఘటన ఒడిశాలోని అంగుళ్ జిల్లాలో జరిగింది.
![cobra swallowed a python](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-ang-03-angul-snake-rescue-avo-od10035_17012022223138_1701f_1642438898_957_1801newsroom_1642494746_708.jpg)
![cobra swallowed a python](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-ang-03-angul-snake-rescue-avo-od10035_17012022223138_1701f_1642438898_640_1801newsroom_1642494746_397.jpg)
ఇదీ జరిగింది
ఆహారం కోసం వెతుకుతున్న 11 అడుగుల కోబ్రా.. ఎదురుపడిన ఆరు అడుగుల కొండచిలువను మింగేసింది. తర్వాత కర్దపడ గ్రామంలోకి ప్రవేశించింది. దీనిని చూసిన స్థానికులు భయాందోళనతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది కోబ్రాను పట్టుకున్నారు. దానిని సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. అయితే కొండచిలువ అప్పటికే చనిపోయింది.
![cobra swallowed a python](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-ang-03-angul-snake-rescue-avo-od10035_17012022223138_1701f_1642438898_34_1801newsroom_1642494746_1058.jpg)
ఇదీ చూడండి: డ్రైనేజీలో అపస్మారక స్థితిలో మందుబాబు.. తీరా లేపి చూస్తే..!