ETV Bharat / bharat

ఉగ్రవాద కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం - ఎదురుకాల్పులు

Encounter in Rajouri
జమ్ముకశ్మీర్​ లో ఎన్​కౌంటర్​
author img

By

Published : Oct 11, 2021, 12:57 PM IST

Updated : Oct 11, 2021, 1:17 PM IST

12:55 October 11

ఉగ్రవాద కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం

జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లా రాజౌరీ సెక్టార్​లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. అందులో జూనియర్​ కమిషన్డ్​ అధికారి(జేసీఓ) ఉన్నారు. జిల్లాలోని పిర్​ పంజాల్​ పరిధి, సురాంకోట్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరగినట్లు జమ్ము రక్షణ విభాగం ప్రతినిధి తెలిపారు.  

సూరంకోట్​ అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామంలో​ ముష్కరులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఇరువురి మధ్య భీకరపోరు జరిగింది. ఈ క్రమంలో జేసీఓ సహా నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 

సరిహద్దుల్లోని ఛామ్రోర్​ అటవీ ప్రాంతంలో భారీగా ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని, నియంత్రణ రేఖ దాటేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Last Updated : Oct 11, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.