ETV Bharat / bharat

వింత: పనస చెట్టుకి జామకాయ! - కేరళ కోజికోడ్​ వార్తలు

చెట్లకు అంటుకట్టడం ద్వారా రకరకాల పువ్వులు, పండ్లు ఉత్పత్తి చేయడాన్ని ఇదివరకు చదివాం. చూశాం. అయితే ఎవరి హస్తమూ లేకుండా పనస చెట్టుకు జామకాయ కాయడం చూశారా? కేరళ కోజికోడ్​లో జరిగిన ఈ ఘటనను ప్రకృతి వింతే అంటున్నారు గ్రామస్థులు.

A jackfruit tree in Kozhikode, Kerala bears guava
పనస చెట్టుకి జామకాయ
author img

By

Published : Apr 28, 2021, 11:42 AM IST

పనస చెట్టుకి కాసిన జామకాయ గ్రామస్థులు

కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కోమ్ అనే గ్రామంలో ఉన్న ఓ ఇంట్లో పనస చెట్టుకు జామకాయ కాసింది. ఈ తరహా ఘటనలు ఇంతకుముందు చూసినప్పటికీ.. పనస చెట్టుకు జామకాయ అనేది వింతే అంటున్నారు అక్కడి ప్రజలు. ఈ విషయాన్ని మొదట కునుమ్మల్ సత్యవతి, ఆమె కుమార్తె షైజా మంగళవారం గుర్తించారు.

ఆ దారి గుండా వెళ్తున్న వీరు మొదట ఆశ్చర్యపోయినప్పటికీ.. తమను ఆట పట్టించేందుకు ఎవరో కావాలనే పనస చెట్టుకి జామకాయను పెట్టి ఉంటారని భావించారు. అయితే.. నిశితంగా పరిశీలించి నిజమని గ్రహించారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో 'పనస-జామ'ను చూసేందుకు జనాలు తరలి వస్తున్నారని తోట యజమాని కునుమ్మల్‌ వివరించారు. అంతేగాక సందర్శకులు ఈ చెట్టు ముందుకు చేరి సెల్ఫీలు దిగుతున్నారని తెలిపారు.

ఇవీ చదవండి:

కొవ్వొత్తులా వెలుగునిచ్చే 'పాండవ చెట్టు'

కొబ్బరి చెట్టే అక్కడి తీరప్రాంత రైతులకు కామధేను!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.