ETV Bharat / bharat

బోరుబావిలో పడిన వారిని రక్షించేందుకు కెమెరా- రూ.10 వేలతో రెండు రోజుల్లో తయారీ! - ఒడిశా ఇంజినీర్ విక్టిమ్ డిటెక్షన్ కెమెరా ఆవిష్కరణ

A Engineer Develops Camera For Rescue Operations : బోరుబావిలో పడిన బాధితులను గుర్తించేందుకు ఓ ఇంజినీర్ కొత్త కెమెరాను తయారు చేశారు. 50 అడుగల లోతు వరకు ఆడియో, వీడియో రికార్డు చేయగలిగే ఈ పరికరాన్ని తయారు చేశారు.

A Engineer Develops Camera For Rescue Operations

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 4:46 PM IST

బోరుబావిలో పడిన వారిని రక్షించేందుకు కెమెరా- రూ.10 వేలతో రెండు రోజుల్లో తయారీ!

A Engineer Develops Camera For Rescue Operations : బోర్​వెల్​లో పడిన వారిని రక్షించటం కోసం ఒడిశాకు చెందిన ఓ ఇంజనీర్ కెమెరాను తయారు చేశారు. 50 అడుగుల లోతులో ఆడియో, వీడియోలను రికార్డు చేయగలగే సామర్థ్యంతో అతి తక్కువ ఖర్చుతో కెమెరాను అభివృద్ధి చేశారు. మొదట్లో పారిశ్రామిక అవరసరాల కోసం రూపొందించాలనుకున్న ఈ పరికరం ఇప్పుడు బోర్​వెల్​లో పడిన వారిని రక్షించేందుకు ఉచితంగా అందించనున్నారు.

సంబల్​పుర్​ జిల్లాకు చెందిన ఆశిష్​ మహానా బోరుబావిలో పడిన వారి కోసం తయారు చేసిన పరికరం విక్టిమ్ డిటెక్షన్ కెమెరా. దీనిని కేవలం రెండు రోజుల్లోనే రూ. 10 వేల రూపాయలతో రూపొందించారు. ఈ కెమెరాలో చిన్న మానిటర్, ఐదు మెగాపిక్సిల్ కెమెరా, 12 వోల్ట్ రీఛార్జ్ చేయగల బ్యాటరీ, మైక్రోఫోన్, బ్లూటూత్, కేబుల్, ఛార్జర్​ ఉన్నాయి. ముందుగా పారిశ్రామిక అవరసరాల కోసం తయారు చేయాలనుకున్న కెమెరాను ఈ ఘటనతో బాధితులను రక్షించేందుకు వినియోగించాలని నిర్ణయించుకున్నాడు ఆశిష్ మహానా.

"రీసెంట్​గా లారిపలిలో ఓ చిన్నారి బోర్​వెల్​లో ఇరుక్కుపోయినట్లు తెలిసింది. రెస్క్యూ టీమ్​తో సేవ్ చేయడం సాధ్యం కాకపోతే మరెలా?.. ఇదే విషయం నాకు తెలిసింది. దీంతో ఈ కెమెరాను డెవలప్ చేశా. ఈ కెమెరా 50 ఫీట్ల లోతు వరకూ ఉన్న వాటిని గుర్తిస్తుంది. ప్రస్తుతం చిన్న మానిటర్, బ్యాటరీ, లైట్, ఛార్జర్, కేబుల్ ఉపయోగించి కెమెరా వాడుతున్నా."
-ఆశిష్​ మహానా, ఇంజినీర్

బోర్​వెల్ రెస్క్యూ ఆపరేషన్​లలో ఈ కెమెరాను ఉపయోగించడానకి ఆశిష్ జిల్లా పరిపాలన సహాయాన్ని కోరారు. "ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్​లోనైనా ఈ కెమెరాను ఉపయోగించవచ్చు. ఆర్థిక సహాయం అందించినట్లయితే ఇంక మంచి నాణ్యమైన కెమెరాలను తయారు చేస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా రెస్క్యూ ఆపరేషన్​కు అవసరమైతే ఉచితంగా ఈ కెమెరాను ఇస్తాను." అని ఆశిష్ మహానా తెలిపారు.

అంధులను గైడ్ చేసే 'స్మార్ట్ క్యాప్'.. కేవలం రూ.2వేలకే తయారు చేసిన​ బాలుడు
Smart Cap For Blind : రోడ్డు దాటలేక అంధులు పడుతున్న అవస్థలను చూసి చలించిపోయాడు ఓ బాలుడు. వారి కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు. రూ.2 వేల బడ్జెట్​లో స్మార్ట్ క్యాప్​ను తయారు చేశాడు. మరి బంగాల్​కు చెందిన ఆ బాలుడి రూపొందించిన క్యాప్​ను గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Manhole Cleaning Robot : మ్యాన్‌హోల్స్‌ క్లీన్​ చేస్తున్న 'రోబో'.. 360 డిగ్రీల్లో.. చిన్నమరక కూడా లేకుండా..

ఇంటిపైన ల్యాండ్ అయ్యే 'ఈ-ప్లేన్' ట్యాక్సీ.. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ జర్నీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.