ETV Bharat / bharat

'ఏనుగుల మృతి'పై హైడ్రామా- ఆ అధికారుల అదుపులో తమిళ పోలీసులు - కేరళ పోలీసుల అదుపులో తమిళ పోలీసులు

ఏనుగుల గుంపును రైలు ఢీ కొన్న ఘటనలో హృదయాలను కలచివేసే విషయం బయటపడింది. మృతి చెందిన ఏనుగుల్లో ఓ ఏనుగు గర్భంతో ఉన్నట్లు అటాప్సి రిపోర్టుల్లో తేలింది. అయితే.. ఈ ఏనుగుల ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడానికి కేరళకు వెళ్లిన తమిళ పోలీసులను ఆ రాష్ట్ర రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

elephant killed
ఏనుగుల గుంపును రైలు ఢీ
author img

By

Published : Nov 27, 2021, 10:27 PM IST

కోయంబత్తూర్​ సమీపంలో ఏనుగుల గుంపును రైలు ఢీ కొన్న(elephant died in train accident) ఘటనలో మరో హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. మరణించిన గుంపులో ఓ ఏనుగు గర్భంతో ఉన్నట్లు పంచనామాలో తెలింది.

తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని మధురై-కోయంబత్తూర్ ప్రాంతంలో పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఏనుగుల గుంపును శుక్రవారం అర్ధరాత్రి.. మంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి ఏనుగు సహా.. రెండు పిల్ల ఏనుగులు ప్రాణాలు (elephant died in train accident) కోల్పోయాయి. తల్లి ఏనుగుకు 25 ఏళ్ల వయసు. మరో ఆడ ఏనుగుకు 8 ఏళ్లు ఉండగా.. మగ ఏనుగుకు 12ఏళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

కేరళ పోలీసుల అదుపులో తమిళ అధికారులు..

ఈ ఏనుగుల ప్రమాద ఘటన ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఈ ప్రమాదానికి కారణమైన మంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్​ను నడిపిన లోకో పైలెట్​లు కేరళకు చెందినవారు. వారిని విచారించడానికి చేయడానికి వెళ్లిన తమిళనాడు పోలీసు అధికారులను.. పాలక్కడ్​ రైల్వే స్టేషన్​లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మళయాళీ సమాజ్ భవనం ముందు తమిళనాడుకు చెందిన తాంతై పెరియార్ ద్రవిడ కళగం, విడుతళై చిరుతైగళ్ పార్టీ సభ్యులు నిరసనలు చేపట్టాయి.

అయితే.. ఘటనలో రైలును ఆపి ఏనుగులను దూరంగా పంపడానికి ప్రయత్నించినట్లు పైలెట్​లు చెప్పారు.

ఈ విషయంపై పాలక్కడ్ రైల్వే అధికారులతో ఆ జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ చర్చలు జరుపుతున్నారు.

అయితే.. ఏనుగుల మృతికి కారకులైన లోకో పైలెట్​లపై తమిళనాడులో పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి

చెన్నైలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.