బంగాల్ ఆసన్సోల్ ప్రాంతంలోని జమూరియలో భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇరు వర్గాల వారికి తీవ్రంగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం బాంబు దాడి జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆర్ఎస్ఎస్ సన్నాహాలు!
శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం బంగాల్లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ కార్యకర్తలను కాపాడుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలిపింది. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది.
ముఖ్యంగా సంఘ్‌లోని ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలను టీఎంసీ తిప్పికొడుతోంది. తమ పార్టీ కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని చెబుతోంది.
ఇదీ చదవండి:లాక్డౌన్లో కలెక్టర్ సైక్లింగ్- అడ్డుకున్న లేడీ కానిస్టేబుల్