ETV Bharat / bharat

బైక్​పై వెళ్తున్న దంపతులను ఢీకొన్న కారు.. 12 కిలోమీటర్లు ఈడ్చుకుని వెళ్లి.. భర్త మృతి.. - పంజాబ్​లో ట్రాఫిక్ పోలీస్​ ఢీకొన్న మినీ ట్రక్కు

గుజరాత్​లో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్​పై వెళ్తున్న భార్యాభర్తలను కారు ఢీకొట్దింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా కొంతదూరం వరకు ఈడ్చుకుని వెళ్లాడు. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.

accident
యాక్సిడెంట్
author img

By

Published : Jan 25, 2023, 11:01 AM IST

దిల్లీలో స్కూటీపై వెళ్తున్న అంజలీ సింగ్​ను కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన తరహా ఘటన గుజరాత్​లోని సూరత్​లో జరిగింది. మోటార్ సైకిల్​పై వెళ్తున్న సాగర్ పాటిల్, అతడి భార్యను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో పాటిల్ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన అతడి భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే?..

సమాచారం ప్రకారం..
కడోదర - బర్డోలి రహదారిపై జనవరి 18 రాత్రి సాగర్ పాటిల్, అతడి భార్య అశ్వినీ బెన్ బైక్​పై వెళ్తున్నారు. అదే సమయంలో వేగంగా వెళ్తున్న ఓ కారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటన అనంతరం డ్రైవర్ కారును ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనలో పాటిల్ వెనుక సీట్​లో కూర్చున్న అతడి భార్య బైక్ పైనుంచి కిందికి పడిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే పాటిల్ మృతదేహాం మాత్రం కనిపించలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశానికి 12 కిలోమీటర్ల దూరంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. దీనిని పాటిల్​ మృతదేహంగా గుర్తించారు పోలీసులు. వాహనం కింద ఇరుక్కుపోయిన అతడిని నిందితుడు రోడ్డుపై ఈడ్చుకుని వెళ్లటం వల్ల ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు అన్నారు. ఈ ప్రమాదానికి సంబంధిన వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్​లో రికార్డు చేసి పోలీసులకు అందించాడు.

ట్రాఫిక్ పోలీస్​ను ఢీకొట్టి.. ఈడ్చుకుని వెళ్లిన వ్యక్తి..
మరోవైపు.. చెక్ పాయింట్ వద్ద సిగ్నల్స్​ను పట్టించుకోకుండా వెళ్తున్న మినీ ట్రక్కును ఆపమని చెప్పిన ట్రాఫిక్ పోలీస్​ను ఓ వ్యక్తి తన ట్రక్కుతో ఢీ కొట్టాడు. ఈ విషాదకర ఘటన పంజాబ్​లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసు అధికారి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే?..

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం
పంజాబ్ కపుర్తలా​లో అసిస్టెంట్ సబ్ ఇన్​స్పెక్టర్ మల్కియాత్ మంగళవారం మధ్యాహ్నం డీసీ చెక్​పాయింట్​ దగ్గర తనిఖీ చేయటానికి ట్రక్కును ఆపారు. అయితే అతడు వాహనాన్ని ఆపకుండా ట్రాఫిక్ పోలీస్​ను ఢీకొట్టి.. కొంతదూరం ఈడ్చుకుని వెళ్లాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన పోలీస్​ను స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్​లో చికిత్స పొందుతూ పోలీసు అధికారి మృతి చెందారు. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశామని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ హర్విందర్ సింగ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.