ETV Bharat / bharat

యాచకురాలి పెద్ద మనసు.. గుడిలో అన్నదానం కోసం రూ.లక్ష విరాళం

author img

By

Published : Apr 24, 2022, 8:04 AM IST

beggar donates money: పేదరికంలో ఉండి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్న ఓ మహిళ.. తాను దాచిపెట్టిన సొమ్మును దానం చేసింది. లక్ష రూపాయలను గుడికి విరాళంగా ఇచ్చింది.

A Beggar Woman Donates 1lakh:
A Beggar Woman Donates 1lakh:

beggar donates money: కర్ణాటక మంగళూరు సమీపంలో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ సెలిబ్రటీగా మారిపోయింది. కునాడాపూర్‌ గంగోల్లిలో నివసించే అశ్వత్తమ్మ(80).. ఆలయాల వద్ద యాచించి సంపాదించిన సొమ్మును తిరిగి దేవస్థానానికే విరాళం ఇచ్చింది. పొలాలి గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయంలోని అన్నదాన సేవ కోసం రూ.లక్ష విరాళంగా ఇచ్చింది. అశ్వత్తమ్మ పొలాలిలోని ఆలయం బయటే భిక్షాటన చేస్తూ జీవిస్తుంది.

అయ్యప్ప స్వామి భక్తురాలైన అశ్వత్తమ్మ.. నిరంతరం మాల ధరించి పూజ చేస్తూ ఉంటుంది. గతేడాది కూడా అశ్వత్తమ్మ ఉడుపిలోని వివిధ దేవాలయాలకు రూ.5 లక్షల విరాళాలను అందించింది. ఈ మొత్తాన్ని అన్నదాన పథకానికి వినియోగించాలని ఆమె కోరింది. శబరిమల అయ్యప్ప ఆలయానికి లక్ష రూపాయలు, తన్నూరు కంచుగోడు ఆలయానికి రూ.1.5 లక్షలు, సాలిగ్రామ ఆలయానికి లక్ష రూపాయలు అందించింది. ఇలా పేదరికంలో ఉండి భిక్షాటన చేస్తున్నా.. తాను సంపాదించిన సొమ్మును దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అశ్వత్తమ్మ.

ఇదీ చదవండి: పాక్​ రికార్డు బద్దలు కొట్టిన భారత్​.. గిన్నిస్‌లో చోటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.