హైపర్ యాక్టివ్ డిజార్డర్‌తో బాధపడుతున్న కేరళకు చెందిన ఈ బాలుడు.. విద్యుత్ ఛార్జింగ్‌తో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు. కేవలం నాలుగు గంటలు ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని చెబుతున్నాడు. పదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్ వస్తువులంటే చాలా ఆసక్తి. ఏ చిన్న మెషిన్‌ను చూసినా దాన్ని ఒక పట్టు పట్టేవాడు. పలు విధాలుగా దాన్ని వాడుకునేవాడు. ఆ ఆసక్తితోనే ఇప్పుడు.. విద్యుత్ సైకిల్‌ను రూపొందించాడు.
![Sayanth, A 15-year-old suffering from hyperactivity disorder from Kerala Built an electric bicycle. It runs for 90 kilometres after charging the battery for 4 hours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17663861_cycle.jpg)
కాలికట్ జిల్లాలోని కోయిలాండికి చెందిన శ్రీధరన్, గీతల కుమారుడైన సయంత్.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. అతడు.. హైపర్యాక్టివ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. కొన్ని విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టడం, వెంటనే ఏకాగ్రత కోల్పోవడం ఈ వ్యాధి లక్షణం. అయినప్పటికీ.. తన నైపుణ్యంతో ఆశ్యర్యపరుస్తున్నాడు సయంత్. స్థానికంగా జరిగిన జిల్లా సైన్స్ ఫెయిర్‌లో రెండో స్థానాన్ని సంపాదించాడు.
![Sayanth, A 15-year-old suffering from hyperactivity disorder from Kerala Built an electric bicycle. It runs for 90 kilometres after charging the battery for 4 hours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17663861_mdmddd.jpg)
"మా బంధువుల దగ్గర ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్నాను. మా నాన్న ప్రోత్సాహంతో దీన్ని స్టార్ట్ చేశాను. నేను తయారు చేసిన విద్యుత్ సైకిల్ నాలుగు గంటలు ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హ్యాండిల్ దగ్గర బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. అది ఛార్జింగ్ అయిపోతే చెబుతుంది. ఇప్పుడు నేను రూపొందించిన సైకిల్‌కు సుమారు రూ.25 వేలు ఖర్చు అవుతోంది. బేసిక్‌గా సైకిల్ తయారు చేయాలంటే పది నుంచి పదిహేను వేలు వరకు ఖర్చు అవుతుంది."
-సయంత్, విద్యుత్ సైకిల్ రూపకర్త
"నా కుమారుడికి చిన్నప్పుటి నుంచి విద్యుత్ మెషిన్లు అంటే ఆసక్తి. ఏ చిన్న మెషిన్‌ను చూసినా.. దాన్ని కాస్త మార్చి కొత్తగా తయారు చేస్తాడు. వాడికి కావాల్సిన ఏ పరికరాలు అయినా తెచ్చి ఇస్తాను. సయంత్ తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు సహాయపడతాను."
-సయంత్ తండ్రి
తాను రెండో తరగతి నుంచి సైకిల్ తొక్కేవాడినని.. అప్పుడే ఎలక్ట్రిక్ సైకిల్ గురించి ఆలోచించానని సయంత్ చెప్పాడు. తాను తయారు చేసిన సైకిల్‌కు బీఎల్డీసీ మోటర్, బైక్ చైన్ అమర్చినట్లు చెప్పాడు. పదో తరగతి పూరయ్యాక పాలిటెక్నిక్ చదవాలనుకుంటున్నట్లు తెలిపాడు.