కర్ణాటకలోని కుప్పూరు గడ్డుగే మఠాధిపతిగా (Kuppuru gadduge samsthana mutt) 13 ఏళ్ల బాలుడు ఎంపికయ్యాడు. ఇప్పటివరకు ఈ మఠాధిపతిగా ఉన్న యతింద్ర శివాచార్య స్వామీజీ కొవిడ్ కారణంగా సెప్టెంబర్ 25న కన్నుమూశారు. (Kuppuru mutt Swamiji death) దీంతో 13 ఏళ్ల తేజస్ కుమార్ను స్వామీజీ వారసుడిగా ప్రకటించారు.
తుమకూరు జిల్లాలోని చిక్కనకనహళ్లి తాలుకాలో ఈ మఠం ఉంది. మఠాధిపతి (Kuppuru swamiji) అంత్యక్రియలు నిర్వహించేందుకు వారసుడు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తుమకూరు జిల్లా ఇంఛార్జి మంత్రి జేసీ మధుస్వామి, ఇతర మఠాల అధిపతుల సమక్షంలో కొత్త మఠాధిపతిని ఎంపిక చేశారు. చివరకు, యతింద్ర స్వామి అంత్యక్రియలను తేజస్ చేతుల మీదుగా జరిపించారు.
2008 ఏప్రిల్ 22న జన్మించాడు తేజస్ కుమార్. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మైసూరులోని సుత్తూరు మఠంలో తన విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఈ బుడ్డోడు.. 427 గ్రామాలకు పెదరాయుడు!