అసోం అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 126 స్థానాలకుగాను 946 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బుధవారం తెలిపారు.
ఏ దశలో.. ఎంత మంది?
- అసోంలో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
- 47 స్థానాలకు జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో 264 మంది పోటీ చేయనున్నారు.
- 39 స్థానాలకు జరగనున్న రెండో దశ ఎన్నికల్లో 345 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు
- 40 స్థానాలకు జరిగే మూడో దశ ఎన్నికల్లో 337 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు.
- అసోంలో మొత్తం 2,33,74,087 మంది ఓటర్లు ఉన్నారు.
- మొత్తం ఓటర్లలో పురుషులు 1,18,23,286 కాగా.. స్త్రీలు 1,15,50,403, ట్రాన్స్జెండర్లు 398 మంది.
ఇదీ చూడండి:అసోం ఎన్ఆర్సీ సవరణకు భాజపా హామీ
ఇదీ చూడండి:'అసోంలో మాఫియాలా పనిచేస్తోన్న భాజపా'