దేశంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగో రోజూ లక్ష దిగువన కరోనా కేసులు(covid cases) నమోదయ్యాయి. కొత్తగా 91,702 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే మరణాలు మాత్రం ఆందోళకర రీతిలో మళ్లీ పెరిగాయి. మహమ్మారి ధాటికి మరో 3,403 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,92,74,823
- యాక్టివ్ కేసులు: 11,21,671
- కోలుకున్నవారు: 2,77,90,073
- మొత్తం మరణాలు: 3,63,079
కరోనా సోకిన వారిలో మరో 1,34,580 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రికవరీ రేటు 94.93 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.24 శాతానికి పెరిగింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
37.42 కోట్ల పరీక్షలు..
దేశవ్యాప్తంగా గురువారం 20,04,690 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 37,42,42,384కు చేరినట్లు చెప్పింది.
వ్యాక్సినేషన్..
ఒక్కరోజే 33,79,261 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 24,27,26,693కు చేరినట్లు చెప్పింది.
ఇవీ చూడండి: