ETV Bharat / bharat

'2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఉమ్మడి ప్రణాళిక'​.. నీతి ఆయోగ్​లో మోదీ - BJP On CMs Absence

Niti Aayog Meeting : ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం శనివారం దిల్లీలో జరిగింది. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలన్న లక్ష్యాలకు సంబంధించిన విషయాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ భేటీకి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు.

Niti Aayog 8th Council Meeting
నీతి ఆయోగ్' సమావేశం
author img

By

Published : May 27, 2023, 5:45 PM IST

Niti Aayog Meeting : 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించటానికి.. ఉమ్మడి లక్ష్యం అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. ప్రజల కలలు, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆర్థికంగా ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన 8వ నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాని మోదీ.. రాష్ట్రాలు వృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. 2047నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరించేందుకు ఉమ్మడి లక్ష్యం ప్రాముఖ్యతను ప్రధాని మోదీ నొక్కి చెప్పినట్లు నీతి ఆయోగ్‌ ట్వీట్‌ చేసింది. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకుగాను ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు.

Niti Aayog 8th Council Meeting
నీతి ఆయోగ్​ 8వ గవర్నింగ్​ కౌన్సిల్​ భేటీ

9 రాష్ట్రాల సీఎంలు దూరం..
CM Absence To Niti Aayog Meeting : నీతి ఆయోగ్​ 8వ గవర్నింగ్​ కౌన్సిల్​ భేటీకి బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, కేరళ సీఎం పినరయి విజయన్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లోత్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గైర్హాజరయ్యారు.

భేటీకి హాజరుకాకపోవడానికి సీఎంల కారణాలు!
దిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు, బదిలీల విషయమై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన నేపథ్యంలో నీతి ఆయోగ్‌ నిర్వహించే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. అలాగే నిధుల కేటాయింపు విషయంలో పంజాబ్‌పై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బంగాల్​ తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్‌ సెక్రటరీని పంపించేందుకు అనుమతినివ్వాలని టీఎంసీ ప్రభుత్వం కోరింది. అయితే ఈ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించడం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సమావేశానికి రాలేనని ప్రకటించారు.

జపాన్, సింగపూర్ పర్యటన కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ కూడా ఈ భేటీకి హాజరుకాలేక పోయారు. కర్ణాటకలో ఆదివారం కేబినెట్‌ విస్తరణ జరిగింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశంలో పాల్గొనలేక పోయారు. పలు అనారోగ్య కారణాల రీత్యా రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లోత్​ హాజరుకావడం లేదంటూ ప్రకటించారు. ముందస్తుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో తామూ సమావేశానికి రాలేమని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. భేటీ గైర్హాజరీకి సంబంధించి గల కారణాలను కేరళ సీఎం పినరయి విజయన్‌ వెల్లడించలేదు.

ఇవి బాధ్యతారాహిత్య నిర్ణయాలే: బీజేపీ
BJP On CM's Absence : నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. "ఇది చాలా దురదృష్టకరం.. భేటీకి హాజరుకాని ముఖ్యమంత్రుల నిర్ణయం ప్రజా వ్యతిరేకం, బాధ్యతారాహిత్యం" అని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు. 100 అంశాలను చర్చించే కీలక సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు హాజరుకాలేదని లేదని రవిశంకర్‌ ప్రశ్నించారు. భేటీకి రాకపోతే వారి రాష్ట్ర ప్రజల వాణిని ఆయా రాష్ట్రాల సీఎంలు ఎలా వినిపిస్తారని ఆయన సూటి ప్రశ్న వేశారు. మోదీని విమర్శించేందుకు ఇంకా చాలా అవకాశాలు వస్తాయని.. రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించేలా ఉన్న ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. అలాగే దేశాభివృద్ధి లక్ష్యాలు, వాటి ఫ్రేమ్‌ వర్క్, రోడ్‌ మ్యాప్‌లను నీతి అయోగ్‌ నిర్దేశిస్తుందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.