ETV Bharat / bharat

87 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం- నిస్సహాయ స్థితిలో ఉండగా.. - దిల్లీ రేప్

old woman raped: దిల్లీలో దారుణం జరిగింది. మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఆమె చరవాణిని లాక్కెళ్లాడు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అయితే, ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

old woman raped
old woman raped
author img

By

Published : Feb 14, 2022, 5:17 PM IST

old woman raped: మంచానికే పరిమితమైన 87ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసిన దుండగుడు.. ఆమె ఫోన్​ను దొంగలించుకొని పారిపోయాడు. దిల్లీలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి వృద్ధురాలు ఉంటున్న ఇంట్లోకి చొరబడ్డాడు. అతడిని చూసి వృద్ధురాలు ఎవరు? అని ప్రశ్నించింది. గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చానని, ఇంట్లో రిపేర్ ఉందని పిలిచారని దుండగుడు చెప్పుకొచ్చాడు. అయితే, వృద్ధురాలికి అనుమానం వచ్చింది. ఇది గమనించిన ఆ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, ఆమె మొబైల్ ఫోన్​ను లాగేసుకున్నాడు.

Delhi crime news

ఆ సమయంలో వృద్ధురాలి కుమార్తె(65) ఇంట్లో లేదు. కుమార్తె తిరిగి ఇంటికి వచ్చే సరికి వృద్ధురాలు గాయపడి ఉంది. వెంటనే ఆ మహిళ ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వృద్ధురాలిపై లైంగిక దాడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై ఐపీసీ సహా లైంగిక నేరాలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల అలసత్వం!

అయితే, ఫిర్యాదు నమోదు చేసుకోవడంలో పోలీసులు జాప్యం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దిల్లీ పోలీసులు సహకరించడం లేదని, ఎఫ్ఐఆర్ నమోదును వ్యతిరేకించారని కుటుంబ సభ్యులకు చెందిన ఓ సన్నిహితుడు ట్వీట్ చేశారు.

అయితే, ఈ ఆరోపణలను ఖండించిన పోలీసులు.. తిలక్ నగర్ స్టేషన్​లో ఆదివారం రాత్రి దొంగతనానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. ఫిర్యాదుదారులు తనపై లైంగిక దాడి జరిగిందని సోమవారం చెప్పారని, ఆ తర్వాత సంబంధిత సెక్షన్లను ఎఫ్ఐఆర్​కు జోడించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: కర్ణాటకలో హిజాబ్ లేని విద్యార్థులకే స్కూల్​లోకి ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.