ఎక్కడైనా కోడి గుడ్లను కృత్రిమంగా పొదిగించడం చూశాం. ఇంకేవైనా గుడ్లు పొదిగించడం చూశాం. కర్ణాటక, మంగళూరుకు చెందిన పాముల సంరక్షులు కిరణ్, అజయ్ మాత్రం ఏకంగా కొండ చిలువ గుడ్లనే పొదిగించారు. అవి పిల్లలుగా మారాక అటవీ శాఖ అధికారుల సహాయంతో అడవిలో వదిలిపెట్టారు. కిరణ్, అజయ్ చేసిన పనికి అటవీ సిబ్బందితో సహా, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే: దొంగకేరి సమీపంలోని వెంకటరమణ ఆలయానికి ఎదురుగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ పాము గుడ్లు కనిపించాయి. దీంతో ఇంటి యజమాని షమిత్ సువర్ణ మంచి మనసుతో పాము సంరక్షకులు అజయ్‌కు గుడ్లు కనిపించిన విషయం తెలియజేసింది. ఈ విషయాన్ని అజయ్.. కిరణ్‌కు తెలపగా ఇంక్యుబేషన్ విధానంలో గుడ్లు పొదిగే ఏర్పాటు చేశారు.
గుడ్లు పొదిగి కొండచిలువ పిల్లలుగా ఏర్పడిన తర్వాత బంట్వాళ జోనల్ అటవీ అధికారి రాజేశ్ బలిగార్ను కలిసి సమాచారం అందించారు. ఎనిమిది కొండ చిలువ పిల్లలను అటవీ అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో సబ్ జోనల్ అటవీ అధికారి ప్రీతం పూజారి, అటవీ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం వీరు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.
ఇవీ చదవండి: పాము గుడ్లను రక్షించి.. కృత్రిమంగా పొదిగించి!
కృష్ణుడి విగ్రహం మింగేసిన భక్తుడు.. డాక్టర్ల శ్రమతో లక్కీగా..