ETV Bharat / bharat

రామాలయ నిర్మాణానికి నిపుణుల కమిటీ - రామ మందిరం తాజా సమాచారం

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణ కమిటీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా ఎనిమిది మంది నిపుణులు ఉండనున్నారు. వీరంతా నిర్మాణ రంగంలో అనుభవజ్ఞులు.

8-member expert panel set up to supervise Ram temple foundation-laying work
రామమందిర నిర్మాణానికి 8మంది నిపుణుల కమిటీ
author img

By

Published : Dec 14, 2020, 3:21 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఈ ప్యానెల్​కు దిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్​ వీఎస్​ రాజు నేతృత్వం వహించనున్నారు. నిర్మాణ రంగంలో నిపుణలు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. వీరు ఆలయానికి సంబంధించిన పునాది, ఇతర నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. వివిధ వర్గాల వారి నుంచి వచ్చే సలహాలను పరిగణనలోకి తీసుకొని నాణ్యమైన, వీలైనంత ఎక్కువ రోజులు ఉండేలా ఆలయాన్ని నిర్మించడమే లక్ష్యంగా ట్రస్ట్​ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

రామాలయ నిర్మాణ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్​ను ట్రస్ట్​ విడుదల చేసినట్లు అయోధ్య భాజపా ఎమ్మెల్యే వేద్ గుప్తా తెలిపారు.

ఇవీ చూడండి:

36-40 నెలల్లో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి

'అయోధ్య రామధామం- వెయ్యేళ్లు పదిలం'

'అయోధ్యలో నిర్మాణాలకు మీరూ సలహాలు ఇవ్వొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.