ETV Bharat / bharat

దిల్లీలో 70ఏళ్ల కనిష్ఠానికి మే నెల ఉష్ణోగ్రతలు

దేశ రాజధానిలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా.. అక్కడి వాతవారణం చల్లబడటం వల్ల.. మే నెలలో 70ఏళ్ల తర్వాత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Low temperature
దిల్లీ, కనిష్ఠ ఉష్ణోగ్రత
author img

By

Published : May 20, 2021, 10:16 AM IST

దిల్లీలో బుధవారం భారీ వర్షాలు కురవడం వల్ల.. మే నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఫలితంగా.. ఉష్ణోగ్రత 16 డిగ్రీ సెల్సియస్​గా నమోదైంది. గత 70ఏళ్లలో మే నెల ఉష్ణోగ్రతలు ఇంత స్వల్పస్థాయికి చేరడమిదే తొలిసారని వాతవారణ విభాగం తెలిపింది.

అంతకుముందు.. 1982 మే13న కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8కి పడిపోయింది. 1951లో నమోదైన 23.8 డిగ్రీ సెల్సియస్​ ఉష్ణోగ్రతే ఇంతవరకు అత్యల్పం కాగా.. తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది.

అయితే.. దిల్లీలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 31.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ నిపుణులు వెల్లడించారు. గురువారం కూడా దిల్లీలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.

ఇదీ చదవండి: పడగెత్తుతున్న విపత్తులు.. నష్టనివారణే తక్షణ కర్తవ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.