ETV Bharat / bharat

28 ఏళ్ల కోడలితో 70 ఏళ్ల మామ పెళ్లి.. కుమారుడి మరణంతో.. - గోరఖ్​పుర్​లో కోడలు మామ పెళ్లి

28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్నాడో 70 సంవత్సరాల మామ. స్థానిక ఆలయంలో పూలదండలు మార్చుకుని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.

70 year man married with 28 year old daughter in law

author img

By

Published : Jan 26, 2023, 4:30 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో విచిత్ర ఘటన జరిగింది. 70 ఏళ్ల మామ 28 సంవత్సరాల కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన గోరఖ్​పుర్​ జిల్లాలో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే.. బడల్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఛపియా ఉమ్రావ్​ గ్రామంలో కైలాశ్​ యాదవ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతడికి నలుగురు పిల్లలున్నారు. 12 ఏళ్ల క్రితమే భార్య చనిపోయింది. కాగా, పిల్లలందరికీ పెళ్లిళ్లు అయి విడిగా జీవిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం కైలాశ్​ మూడో కుమారుడు కూడా చనిపోయాడు. దీంతో అతడి భార్య పూజ ఒంటరిగానే ఉంటోంది. తాజాగా కైలాశ్​ పూజను సమీపంలోని ఓ గుడిలోకి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. నుదుట సిందూరం దిద్ది పూల దండలు మార్చుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది. దీంతో ఈ పెళ్లిపై భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు నెటిజన్లు.

70 year man married with 28 year old daughter in law
కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ

ఈ పెళ్లి గురించి కైలాశ్​ సొంతూళ్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 28 ఏళ్ల కోడలిని గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన మామపై స్థానికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయినా వాటికి కైలాశ్​ సమాధానం ఇవ్వటం లేదు. కాగా, ఈ పెళ్లి అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. 'కోడలిపై అంత బాధ్యత ఉంటే.. మరొకరికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది' అని ఆ వృద్ధుడి వ్యవహారంపై కొంత మంది మండిపడుతున్నారు. మరికొంత మంది దీన్ని వ్యతిరేకిస్తూనే.. ఇద్దరి అంగీకారంతోనే విషయం పెళ్లి వరకు వెళ్లిందని అభిప్రాయపడుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.