మహారాష్ట్రలో వరుస అత్యాచార ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో అమానవీయ ఘటన జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఏం జరిగిందంటే..?
మహారాష్ట్ర, అమరావతి జిల్లా అంజన్గావ్సుర్జి మండలం వంజ గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి.. తన స్నేహితులతో కలిసి మూత్రవిసర్జనకు వెళ్లింది. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు.. బలవంతంగా బాలికను తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక తన పొలంలో ఆగి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సుత్తితో బెదిరించి...