ETV Bharat / bharat

రైలు లక్ష్యంగా బాంబు.. ఆడుకుంటూ వెళ్లి డబ్బా తెరిచిన పిల్లలు.. ఏడేళ్ల బాలుడు మృతి - బంగాల్​ బాంబు పేలుడు

Bomb Blast In Bengal : రైల్వే ట్రాక్​ సమీపంలో బాంబు పేలడం వల్ల ఏడేళ్ల బాలుడు మరణించగా.. మరో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ఘటన బంగాల్​లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగింది.

bengal bomb blast
bengal bomb blast
author img

By

Published : Oct 25, 2022, 5:23 PM IST

Bomb Blast In Bengal : బంగాల్ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పేలుడు సంభవించింది. రైలును లక్ష్యంగా చేసుకుని ట్రాక్​ సమీపంలో బాంబు పెట్టగా.. ప్రమాదవశాత్తు పేలి ఏడేళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు పిల్లలు గాయాలపాలయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ సమీపంలో బాంబును పెట్టారని.. బాలుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుూ వెళ్లి డబ్బాను తెరవగా బాంబు పేలిందని పోలీసులు చెప్పారు. బాంబ్ స్క్వాడ్​తో తనిఖీ చేయించగా మరో బాంబు లభించిందని వెల్లడించారు.

ఈ ప్రమాదం కాకినార-జగద్దల్​ స్టేషన్ల మధ్య ఉదయం 8గంటలకు జరిగిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పిల్లలను ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఒకరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు వైద్యులు. ఇద్దరు పిల్లలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ప్రమాద స్థలంలో లభ్యమైన బాంబు
bengal bomb blast
బాంబును బయటకు తీస్తున్న సిబ్బంది

ఇవీ చదవండి: మద్యం బాటిల్​లో చనిపోయిన కప్ప.. ప్రభుత్వ దుకాణంలో కొన్న వ్యక్తికి షాక్

'ఆ పేలుడు వెనక ఉగ్రహస్తం.. నిందితులకు ఐసిస్​తో లింకులు.. విదేశాల నుంచి ప్లాన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.