ETV Bharat / bharat

దారుణం.. మురికి కాల్వలో ఏడు శిశు పిండాలు

author img

By

Published : Jun 24, 2022, 8:00 PM IST

కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. అయిదు నెలల వయసున్న పిండాలను డబ్బాల్లో పెట్టి మురిగకి కాల్వలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

7 foetus found dumped
మురికి కాల్వలో ఏడు పిండాలు

కర్ణాటకలో దారుణం జరిగింది. బెళగావిలోని ముదలగి బస్టాండ్​ సమీపంలోని వంతెన వద్ద గల మురికి కాల్వలో ఏడు పిండాలు కనిపించాయి. వీటిని డబ్బాల్లో పెట్టి కాలువలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ పిండాల్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వీటిని అక్కడ ఎవరు వేశారో ఇంకా తెలియలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మురికి కాల్వలో ఏడు పిండాలు

"ముదలగి పట్టణ వంతెన వద్ద ఐదు డబ్బాల్లో ఏడు పిండాలు లభ్యమయ్యాయి. ఈ పిండాలన్నీ అయిదు నెలల వయసు ఉన్నవే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నాక పిండాలను బెళగావిలోని సైన్స్ ప్రయోగశాలకు పంపుతాం. ఈ హత్యలకు గల కారణాన్ని అన్వేషించేందుకు పోలీసులు ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే స్థానిక ఆసుపత్రికి పిండాలను తరలించాం. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందిస్తాం."

- మహేష్ కొహ్ని, జిల్లా ఆరోగ్య అధికారి

ఇవీ చదవండి: కృష్ణుడి విగ్రహం మింగేసిన భక్తుడు.. డాక్టర్ల శ్రమతో లక్కీగా..

అంధవిశ్వాసం.. గుడిలో నాలుక కోసేసుకున్న భక్తురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.