ETV Bharat / bharat

రోజంతా రావిచెట్టుపైనే మకాం.. ఎందుకంటే?

మధ్యప్రదేశ్​ ఇందోర్​కు చెందిన ఓ వృద్ధుడు సాహసోపేతమైన పనులు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రావిచెట్టుపైనే మకాం వేస్తున్నారు. అసలు ఎందుకు ఆ వృద్ధుడు రావి చెట్టును ఎక్కుతున్నాడు?

68-yr old man encamps on peepal tree
రావిచెట్టు ఎక్కిన రాజేంద్ర పాటిదార్​
author img

By

Published : May 16, 2021, 1:39 PM IST

కరోనా రెండో దశ విజృంభణ కారణంగా దేశం ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటోంది. దీని వల్ల ఆక్సిజన్​ ఆవశ్యకత ప్రతిఒక్కరికి అర్థమైంది. మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని రంగ్వసా గ్రామానికి చెందిన రాజేంద్ర పాటిదార్​(68).. ప్రాణవాయువు​ను ప్రకృతి నుంచి ఎలా పొందాలో వివరిస్తున్నారు. అందుకోసం 68ఏళ్ల సాహసం చేసి రావి చెట్టు ఎక్కుతున్నారు.

రోజూ రావి చెట్టుపైనే

68-yr old man encamps on peepal tree for oxygen in Indore
రావిచెట్టు ఎక్కేందుకు సిద్ధమైన రాజేంద్ర పాటిదార్​

రాజేంద్ర ఇంటివద్ద రెండు రావిచెట్లు ఉన్నాయి. రోజూ ఉదయం రావిచెట్టు ఎక్కి కుర్చీ వేసుకుని సాయంత్రం వరకు అక్కడే కూర్చుంటారు. రాజేంద్ర మనవడు సైతం తాత బాటలోనే రావిచెట్టుపై కూర్చుంటాడు. రావిచెట్టు 24 గంటలు తాజా, నాణ్యమైన ఆక్సిజన్​ను విడుదల చేస్తుందని రాజేంద్ర చెబుతున్నారు.

చెట్టుఎక్కేందుకు కుర్చీతో వెళ్తూ..

ప్రజలకు వివరించేందుకే..

రావిచెట్టుపై కూర్చుని...

ఇందోర్​లో ఆక్సిజన్​ కొరత కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో తనకు తెలిసిన ఈ పద్ధతిని ప్రజలకు చెప్పాలని రాజేంద్ర నిర్ణయించుకున్నారు. 20 రోజుల నుంచి ఇలా చేస్తున్నానని, తన ఆక్సిజన్​ స్థాయి 99గా ఉందని చెప్పుకొచ్చారు రాజేంద్ర. చెట్టుపైనే యోగాసనాలు కూడా చేస్తానన్నారు.

రోజూ చెట్టు ఎక్కటం వల్ల వ్యాయామం కూడా చేసినట్లు అవుతుందని వివరిస్తున్నారు. రాజేంద్ర పాటిదార్​ను ఆదర్శంగా తీసుకుని గ్రామంలో చాలా మంది రావిచెట్టుపై కూర్చునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇదీ చదవండి : ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.