ఏప్రిల్27 నుంచి మే 8 వరకు 6,738 ఆక్సిజన్ సిలిండర్లను వివిధ దేశాలు భారత్‌కు పంపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా 3,856 ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు, 16 ఆక్సిజన్ ప్లాంట్లను సమకూర్చాయని వెల్లడించింది. సాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు తెలిపింది.
ఈ ఆక్సిజన్‌ను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆక్సిజన్ సిలిండర్ల కేటాయింపుల కోసం క్రమబద్ధమైన, సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: 'వారం రోజులుగా 180 జిల్లాల్లో కొత్త కరోనా కేసుల్లేవు'