ETV Bharat / bharat

'మహా'లో కరోనా విలయం- ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు - corona cases in kerala

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 62,097 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 519 మంది మరణించారు. ఉత్తర్​ప్రదేశ్​లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 29,754 మంది కరోనా బారిన పడగా.. 167 మంది వైరస్​కు బలయ్యారు. దిల్లీలోనూ రికార్డు స్థాయిలో 28,395 మంది వైరస్​ బారిన పడ్డారు. కేరళలో 19,577 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా.. పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి ఆంక్షల బాట పడుతున్నాయి.

latest corona cases in india
కరోనా సునామీ
author img

By

Published : Apr 20, 2021, 9:55 PM IST

Updated : Apr 20, 2021, 10:13 PM IST

దేశంలో కొవిడ్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే కొత్తగా 62, 097 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్​తో మరో 519 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 39 లక్షల 60 వేల 359కు చేరింది. ఒక్క ముంబయిలోనే 7,214మందికి కరోనా నిర్ధరణ అయింది.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • ఉత్తర్​ప్రదేశ్​లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 29,754 మంది కరోనా బారిన పడ్డారు. మరణాలు సైతం ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఒక్కరోజే 167 మంది వైరస్​కు బలయ్యారు.
  • దిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 28,395 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి 277 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కేరళలో రికార్డు స్థాయిలో కొత్తగా 19,577 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​ ప్రభావానికి మరో 28 మంది మరణించారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 12, 201 మంది వైరస్​ బారిన పడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 64 మంది మరణించారు.
  • తమిళనాడులో కొత్తగా 10,986 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. కొవిడ్​ ధాటికి మరో 48 మంది మరణించారు.
  • ఉత్తరాఖండ్​లో కొత్తగా 3,012 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. వైరస్​తో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • హిమాచల్ ప్రదేశ్​లో కొత్తగా 1,340 మందికి కరోనా సోకింది. మహమ్మారి కారణంగా మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆంక్షల బాట..

మరోవైపు, కరోనా కట్టడికి రాష్ట్రాలు లాక్​డౌన్​ను ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే దిల్లీలో లాక్​డౌన్ కొనసాగుతుండగా.. ఛత్తీస్​గఢ్​లో బుధవారం ఒక్కరోజు లాక్​డౌన్ విధించనున్నారు. ఒక్కరోజు పాటు లాక్​డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కర్ణాటకలో ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

కేరళ ఎర్నాకులం జిల్లాలోని అన్ని కంటైన్​మెంట్ జోన్లలో లాక్​డౌన్​ విధిస్తూ స్థానిక కలెక్టర్ ఎస్ సుహాస్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి 6 గంటల నుంచి ఏడు రోజుల పాటు ఈ లాక్​డౌన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : లాక్​డౌన్​పై ప్రధాని మోదీ కీలక ప్రకటన

Last Updated : Apr 20, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.