భారత్లో 61 మిలియన్ కరోనా టీకా డోసులను పంపిణీ చేయగా.. 84 దేశాలకు 64 మిలియన్ల టీకాను సరఫరా చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆసియావ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాపై నిర్వహించిన 'వరల్డ్ ఇమ్యూనైజేషన్ అండ్ లాజిస్టిక్స్' సదస్సులో మంగళవారం.. ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తి, అంతర్జాతీయ భాగస్వాములకు టీకా సరఫరా చేసే అంశాల గురించి వివరించారు.
"61 మిలియన్లకు పైగా టీకా డోసులను భారత్లో పంపిణీ చేశాం. 84 దేశాలకు 64 మిలియన్ల డోసులను అందించాం. విజ్ఞాన శాస్త్ర లాభాలు ప్రపంచమంతటికీ చేరాలని మేము ఎల్లప్పుడూ భావిస్తాం."
-హర్షవర్ధన్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 1,000 పైకి పైగా మందిన ప్రతినిధులు హాజరయ్యారు. భారత్లో వినియోగిస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల గురించి ఈ సదస్సులో హర్షవర్ధన్ వివరించారు. భారత్లో మరో 6 టీకాలు.. క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు తెలిపారు. అన్నిదేశాలకు టీకా సమానంగా పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన 'హోప్' వేదిక సహాయపడుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'కరోనా పరిస్థితి తీవ్రం- 10 జిల్లాల్లోనే అధిక కేసులు'