ఈ రోజుల్లో.. ఇంట్లో కొంతసేపు కరెంట్ లేకపోయినా.. ఎంతో ఇబ్బందిగా భావిస్తుంటాము. అలాంటిది.. మహారాష్ట్ర నాశిక్ జిల్లా త్రయంబకేశ్వర్ మండలంలోని 60 గ్రామాల ప్రజలు.. పది రోజులుగా చీకట్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా.. రాత్రిళ్లు విద్యుత్ లేకపోవడం వల్ల.. అటవీ జంతువులు దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఈ ప్రాంతంలోని 60 గ్రామాల్లో 8 నుంచి 10 రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. దీంతో గ్రామస్థులంతా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు చీకటిగా ఉండటం వల్ల అడవి జంతువులు మాపై దాడులు చేస్తున్నాయి. అధికారులు వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించాలని మేం వేడుకుంటున్నాం."
- సంజయ్ గంగోడే, బెల్గోడగా గ్రామ సర్పంచ్
బిల్లు చెల్లించనందునే!
"జిల్లా అధికారులు విద్యుత్ బిల్లులను చెల్లించనందునే మా గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశార"ని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు.
ఈ గ్రామాలన్నీ దట్టమైన అటవీ ప్రాంతాల మధ్య ఉన్నాయి. దాంతో చిరుత పులులు వంటి జంతువులు రాత్రిళ్లు గ్రామంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: రైల్వే గోడలపై మేవాడ్ ఘన చరిత్ర.. చూస్తే వావ్!