కొబ్బరి చెట్టు కూలి ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. ఆరు బయట ఆడుకుంటున్న తమ కుమారుడు విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
అసలేం జరిగింది?
మైసూరు జిల్లా కుప్పరవల్లి గ్రామానికి చెందిన అభయ్(6) అనే బాలుడు తమ ఇంటి ముందు మరో చిన్నారితో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఆ సమయంలో ఆకస్మాత్తుగా అక్కడే ఉన్న కొబ్బరి చెట్టు.. బాలుడిపై కుప్పకూలింది. దాంతో అభయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలికకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
అభయ్ మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. ఈ ఘటనపై బిలిగేరే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చూడండి: కాటేసిన పామును పట్టుకుని ఆసుపత్రికి..
ఇదీ చూడండి: బాంబు తయారు చేసి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి...