ETV Bharat / bharat

తండ్రిపై తుపాకీ గురి.. బైక్​పై కూర్చున్న ఆరేళ్ల కుమారుడు బలి - Thief attack on professor

పంజాబ్​లో ఆరేళ్ల చిన్నారిపై కాల్చి చంపారు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు. బాలుడి తండ్రి ఎదుటే ఈ ఘటనకు పాల్పడ్డారు దుండగులు.

6-year-old-boy-killed-by-thugs-in-punjab-front-of-father
ఆరేళ్ల బాలుడిని కాల్చి చంపిన దుండగులు
author img

By

Published : Mar 17, 2023, 1:32 PM IST

Updated : Mar 17, 2023, 2:45 PM IST

దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరేళ్ల చిన్నారి మృతి చెందాడు. బైక్​పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. తండ్రి ఎదుటే కొడుకును కాల్చి చంపారు. గురువారం రాత్రి పంజాబ్​లో ఈ దారుణ ఘటన జరిగింది. బాలుడి తండ్రిని చంపేందుకు వచ్చిన దుండుగులు.. గురితప్పి చిన్నారిని కాల్చినట్లుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం పోలీసుల ఈ వివరాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన బాలుడిని ఉదయవీర్​గా పోలీసులు గుర్తించారు. మన్​సా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొట్లి గ్రామానికి చెందిన జస్​ప్రీత్​ సింగ్​.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో తన కొడుకు ఉదయవీర్, కూతురితో కలిసి ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో బైక్​పై వచ్చిన ఇద్దరు దుండగులు.. జస్​ప్రీత్​ సింగ్​పై కాల్పులు జరిపారు. గురి తప్పి తూటాలు ఉదయవీర్​కు తగిలాయి. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని వెంటనే ఆసుపత్రి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా వైద్యులు తేల్చారు.

బాలుడు మృతితో జస్​ప్రీత్​ సింగ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకెవ్వరూ శత్రువులు లేరని తెలిపిన బాలుడి కుటుంబ సభ్యులు.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. దాడికి పాల్పడ్డ దుండగులు తమ గ్రామానికి చెందిన వారని అనుమానిస్తున్నారు.
"ఘటనపై కేసు నమోదు చేసుకున్నాం. ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడట్లు నిర్ధరణకు వచ్చాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం." అని పోలీసులు తెలిపారు.

ప్రొఫెసర్​పై దొంగ దాడి.. రోడ్డుపై ఈడ్చుకుంటు..
ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళా ప్రొఫెసర్​పై ఓ దొంగ దాడి చేశాడు. అనంతరం ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఆమె బైక్​ను, సెల్​ఫోన్​ను తీసుకుని పారిపోయాడు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రొఫెసర్​ను దొంగ ఈడ్చుకెళ్లిన వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

బాధిత మహిళ పేరు సీతాలక్ష్మి (53). తిరుచ్చి సెంట్రల్ బస్టాండ్ వెనుక వౌసి రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఆమె అన్నా యూనివర్శిటీలో ప్రొఫెసర్​గా, ఈసీఈ డిపార్ట్​మెంట్​కు హెడ్​గా పనిచేస్తున్నారు. ఆదివారం ఆమె తిరుచ్చి జిల్లా కలెక్టరేట్‌ రోడ్డులోని.. వెస్ట్రీ హైస్కూల్‌ గ్రౌండ్‌ సమీపంలో ద్విచక్రవాహనాన్ని పార్క్‌ చేశారు. అనంతరం వాకింగ్‌కు వెళ్లారు. దీన్ని గమనించిన ఓ దొంగ ఆమెను అనుసరించాడు. ఆమె వెనకాలే వెళ్లి.. తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. దీంతో సీతాలక్ష్మి సృహతప్పి పడిపోయారు. వెంటనే ఆమె దగ్గర వస్తువులు తీసుకుని పారిపోయాడు.

సీతాలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని సెంథిల్ కుమార్(32)గా గుర్తించారు. నిందితుడు తంజావూరు జిల్లా పలమనేరి ప్రాంతానికి చెందినవాడని తెలిపారు. సెంథిల్ మద్యానికి, గంజాయికి బానిస అయ్యాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ధరనల్లూర్ కూరగాయల మార్కెట్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని చెప్పారు.
పోలీసులు సెంథిల్​ పట్టుకునేందుకు ప్రయత్నించగా.. బైక్​పై వేగంగా వెళుతూ కిందపడ్డాడు. దీంతో అతడి కాలు విరిగిపోయింది. సెంథిల్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్పించారు.

Last Updated : Mar 17, 2023, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.