ETV Bharat / bharat

అసోంలో 8 మంది ఉగ్రవాదులు హతం

అసోంలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అసోం రైఫిల్స్‌, పోలీసులతో అనుమానిత డీఎన్ఎల్ఏకు చెందిన ఉగ్రమూకలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది డీఎన్‌ఎల్‌ఏ సభ్యులను మట్టుబెట్టాయి బలగాలు.

author img

By

Published : May 23, 2021, 10:43 AM IST

Updated : May 23, 2021, 1:19 PM IST

6 Suspected DNLA cadre killed in an encounter by Police at Karbi Anglong
ఆరుగురు డీఎన్ఎల్ఏ క్యాడర్లు హతం

అసోంలో ఆదివారం తెల్లవారు జామున భద్రతా సిబ్బంది, దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్​కౌంటర్ నాగాలాండ్ సరిహద్దు వెంబడి పశ్చిమ కార్బీ ఆంగ్ లాంగ్ జిల్లాలో జరిగిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఉగ్రమూకల ఉనికిపై సమాచారం మేరకు పశ్చిమ ఆంగ్ లాంగ్ అదనపు ఎస్పీ ప్రకాశ్ సోనోవాల్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది.

అయితే అంతకుముందు పోలీసుల కాల్పుల్లో ఆరుగురే చనిపోయినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. ఎన్​కౌంటర్ అనంతరం జరిపిన కూంబింగ్ లో మరో ఇద్దరు అగ్రనేతల మృతదేహాలు లభించినట్లు ఆయన వెల్లడించారు.

దౌజీఫాంగ్ ప్రాంతంలో గతవారం ఓ పూజరి హత్య జరిగిన నాటి నుంచి జిల్లాలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

భారీగా ఆయుధాలు స్వాధీనం..

నాలుగు ఏకే-47, మరో నాలుగు తుపాకులు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో డీఎన్ఎల్ఏ సహా ఇతర ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో ఐదుగురు దారుణ హత్య

Last Updated : May 23, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.