Police Attack On BJP Leader Farmhouse: మేఘాలయలోని తురా పట్టణంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్. మారక్ తన ఫాంహౌస్లో నిర్వహిస్తున్న వేశ్యాగృహంపై శనివారం పోలీసులు దాడులు చేశారు. ఆరుగురు మైనర్లకు విముక్తి కల్పించి 73 మందిని అరెస్టు చేసినట్లు చెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్సీ విదేశా నంద్ సింగ్ తెలిపారు. రాజకీయవేత్తగా మారిన మాజీ మిలిటెంటు మారక్ పాంహౌస్ పై పక్కా ఆధారంగా దాడి జరిపినట్లు వెల్లడించారు.
తాము రక్షించిన ఆరుగురు మైనర్లలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలిపారు. వీరిని అపరిశుభ్రంగా ఉన్న చిన్నగ దుల్లో తాళం వేసి బంధించి ఉంచారన్నారు. 30 వరకు చిన్న గదులున్న ఆ ఫాంహౌస్లో మారక్ సహచరులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి 73 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సీ వివరించారు. ఈ దాడిలో 27 పెద్ద వాహనాలు, 8 ద్విచక్ర వాహనాలు, 100 బాటిళ్లకు పైగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: 'పక్షపాత రాజకీయాలు వద్దు.. గాంధేయవాదమే మేలు'.. వీడ్కోలు ప్రసంగంలో కోవింద్
ఫేస్బుక్ ద్వారా పరిచయం.. నాలుగేళ్లుగా ప్రేమ.. తీరా చూస్తే ట్రాన్స్జెండర్!