దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 58,924 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,98,262కు చేరింది. వైరస్ బారినపడి మరో 351 మంది మరణించారు. ఒక్క ముంబయి నగరంలోనే కొత్తగా 7,381 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- ఉత్తర్ప్రదేశ్లో రికార్డు స్థాయిలో 28,287 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 167 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 15,785 కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావానికి మరో 146 మంది ప్రాణాలు కోల్పోయారు.
- గుజరాత్లో కొత్తగా 11,403 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 117 మంది మరణించారు.
- తమిళనాడులో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం కొత్తగా 10,941 కేసులు వెలుగుచూశాయి. వైరస్ ధాటికి 44 మంది బలయ్యారు.
- కేరళలో కొత్తగా 13,644 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా