ఉత్తర్‌ప్రదేశ్‌లో వింత ఘటన జరిగింది. తనిఖీల్లో పట్టుబడిన 581 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయంటూ కోర్టులో పోలీసులు వాదనలు వినిపించారు. దీంతో ఆ ఘటనకు సంబంధించి సాక్ష్యాధారాలు జిల్లా కోర్టులో సమర్పించాలని జడ్జి పోలీసులను ఆదేశించారు.
అసలు ఏం జరిగిందంటే.. మథుర జిల్లాలోని షేర్ఘర్ పోలీసులు, హైవే పోలీసులు కలిసి గంజాయి స్మగ్లర్ల నుంచి 581 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఉన్న గోదాంలో ఉంచారు. అయితే కేసు కోర్టుకు వెళ్లినప్పుడు.. నిందితులతో పాటు కొంచెం గంజాయిని సాంపిల్గా సమర్పించారు. దీంతో జడ్జి.. కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక అడిగారు. అనంతరం పోలీసులు అసలు విషయం బయటపెట్టారు.
గోదాంలో నిల్వ ఉంచిన 581 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని చెప్పారు. దీంతో నవంబర్ 26లోపు ఆధారాలను సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎలుకల సమస్యను పరిష్కరించాలని ఎస్ఎస్పీకి సూచించింది. అయితే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మార్తాండ్ ప్రకాశ్ సింగ్ స్పందించారు. భారీ వర్షాల వల్ల గోదాం అంతా నీళ్లతో నిండిపోయి, గంజాయి మొత్తం కుళ్లిపోయిందన్నారు. ఈ క్రమంలో ఎలుకలు తినేశాయని చెప్పారు. కాగా ఎలుకల విషయాన్ని కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొనలేదని.. నీళ్లు నిలవడం వల్లే గంజాయి పాడైపోయిందని మాత్రమే అందులో ఉందని చెప్పారు.
తాగుబోతు ఎలుకలు.. సీసాలకు సీసాలు మద్యం మాయం..
ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో సీజ్ చేసిన 1,452 కార్టన్ల మద్యం ఎలుకలు మాయం చేశాయట. ఈ మేరకు ఉన్నతాధికారులు అడిగిన పోలీసులు సమాధానమిచ్చారు. పుర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మద్యం షాపుల్లో దూరి సీసాలకు సీసాలు మద్యం తాగేశాయి ఎలుకలు. మద్యం నిల్వల్లో ఎందుకు తేడా వచ్చింది అని ప్రశ్నించిన అధికారులకు సదరు షాపు నిర్వాహకులు చెప్పిన మాట ఇదే మరి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి : గుజరాత్ త్రిముఖం: సెంటిమెంట్‌తో మోదీ.. రాజస్థాన్ మోడల్‌తో కాంగ్రెస్.. తాయిలాలతో ఆప్!
ఇంట్లో పేలిన సిలిండర్.. తల్లి, కొడుకు సజీవదహనం.. 12 పశువులు సైతం..