కొవిడ్ కారణంగా తల్లితండ్రులు మరణించి దేశంలో 577 మంది పిల్లలు అనాథలైనట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మంగళవారం వరకు అనాథలైన చిన్నారుల సంఖ్యను నివేదికలో సమర్పించినట్లు పేర్కొన్నారు. కరోనా కారణంగా అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోనుందని అన్నారు.
తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులు జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. మానసికంగా బలహీనంగా ఉన్న చిన్నారులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మెంటల్ హెల్త్ న్యూరోసైన్సెస్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
అనాథల గురించి రాష్ట్రాలు, జిల్లాల అధికారులను కేంద్రం నిరంతరం అడిగి తెలుసుకుంటోంది. యునిసెఫ్‌తో సహా అనేక సంస్థలతో మహిళా, శిశు సంక్షేమ శాఖ చర్చలు జరుపుతోందని సమాచారం.
10 వన్‌స్టాప్ కేంద్రాలు..
మహిళలపై వేధింపుల సమస్యలను పరిష్కరించేందుకు 10 వన్‌స్టెప్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మహిళా, శిశు అభివృద్ధి శాఖ సెక్రటరీ రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. 9 దేశాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:తమిళనాడులో ఆందోళనకర స్థాయిలో కరోనా