ETV Bharat / bharat

ఎయిర్ ఇండియా ఇంటర్వ్యూలకు ఇండిగో సిబ్బంది..  సిక్​ లీవ్​ పేరుతో డుమ్మా.. ఫ్లైట్స్ లేట్! - ఇండిగో ఫ్లైట్స్​ ఆలస్యం

Indigo Flights Delayed: ఇండిగో విమానాల రాకపోకలకు శనివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కువ మంది సిబ్బంది.. సిక్​ లీవ్​లో ఉండటమే ఇందుకు కారణం. అయితే.. వారంతా ఎయిర్​ ఇండియా రిక్రూట్​మెంట్​ డ్రైవ్​కు వెళ్లినట్లు తెలిసింది. దీంతో.. డీజీసీఏ స్వయంగా రంగంలోకి దిగింది.

55 percent IndiGo domestic flights delayed as crew call sick on AI recruitment day; DGCA to probe

author img

By

Published : Jul 3, 2022, 6:51 PM IST

Indigo Flights Delayed: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు శనివారం పెద్ద సంఖ్యలో ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ఏకంగా దేశీయంగా నడిచే 55 శాతం ఫ్లైట్స్​ లేటయ్యాయి. గణనీయ సంఖ్యలో క్యాబిన్​ సిబ్బంది సిక్​ లీవ్​ పెట్టి.. ఎయిర్​ ఇండియా రిక్రూట్​మెంట్​ డ్రైవ్​కు వెళ్లినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ) చీఫ్​ అరుణ్​ కుమార్​ను దీని గురించి అడగ్గా.. ఈ అంశంపై దృష్టి సారించినట్లు వివరించారు.

ఎయిర్​ ఇండియా రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ ఫేజ్​-2 శనివారం జరిగింది. దీంతో చాలా మంది సిబ్బంది.. ఆ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 45.2 శాతం ఇండిగో ఫ్లైట్స్ మాత్రమే శనివారం సమయానికి నడిచినట్లు ​కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెబ్​సైట్లో ఉంది. దేశంలోనే అతిపెద్ద ఎయిర్​లైన్స్​​ అయిన ఇండిగో దేశీయంగా, అంతర్జాతీయంగా కలుపుకొని రోజూ సుమారు 1600 విమానాలు నడుపుతుంటుంది.

ఇదే కారణమా? ఇండిగో ఎయిర్​లైన్స్​లో జీతాల సమస్య ఉంది. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం వరకు కోత విధించింది యాజమాన్యం. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్​ 1న జీతాలను 8 శాతం వరకు పెంచింది. ఎలాంటి అవాంతరాలు లేనట్లయితే నవంబర్​లో మరోసారి 6.5 శాతం మేర జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. అయినా సంతృప్తి పడని కొన్ని వర్గాల పైలట్లు.. వేతనాల తగ్గింపునకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చారు. కొద్దిరోజులకే ఏప్రిల్​ 4న వీరిని విధుల నుంచి బహిష్కరించింది ఇండిగో.

ఎయిర్​ ఇండియాను ఈ ఏడాది జనవరి 27న కేంద్రం.. టాటా గ్రూప్​కు తిరిగి అప్పగించింది. గతేడాది అక్టోబర్​ 8న వేసిన బిడ్డింగ్​లో గెలిచి.. విమానయాన సంస్థ నిర్వహణ, నియంత్రణను తమ అధీనంలోకి తెచ్చుకుంది టాటా గ్రూప్​. ఈ నేపథ్యంలోనే కొత్త విమానాలను కొనుగోలు చేసి సేవల్ని మెరుగుపర్చుకోవాలని చూస్తున్న ఎయిర్​ ఇండియా.. ఇటీవలే రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ ప్రారంభించింది. పెద్ద ఎత్తున క్యాబిన్​ క్రూ సభ్యుల్ని నియమించుకోవాలని భావిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే చాలా మంది ఇండిగో సిబ్బంది.. వేరే విమానయాన సంస్థలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం పెద్ద ఎత్తున ఎయిర్​ ఇండియా ఇంటర్వ్యూలకు వెళ్లినట్లు సమాచారం.

ఇవీ చూడండి: దటీజ్ ఆర్మీ.. 4గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం.. అమర్​నాథ్ యాత్రికులకు రిలీఫ్!

రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణిస్తుండగానే ఇంజిన్​లో మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.