మహారాష్ట్రలోని ఠాణె వృద్ధాశ్రమంలో కరోనా (Covid old age homes) కలకలం రేగింది. ఖడవలీలోని మాతోశ్రీ వృద్ధాశ్రమానికి చెందిన 55 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. వీరందరి వయసు 60కి పైనే ఉందని అధికారులు తెలిపారు. 55 మంది తమ వ్యాక్సినేషన్ రెండు డోసులను ఇదివరకే పూర్తి చేసుకున్నారని చెప్పారు. వీరితో పాటు ఆశ్రమానికి చెందిన ఐదుగురు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇద్దరికి సైతం కరోనా (old age home covid outbreak) సోకిందని వివరించారు.
బాధితులను ఠాణెలోని (Thane old age home covid) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆశ్రమం ఉన్న సోర్గావ్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. 343 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో 1,130 మంది నివసిస్తుండగా... ఇక్కడి అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
106 మందిని పరీక్షిస్తే..
ఆశ్రమంలోని పలువురు వృద్ధులకు అస్వస్థతగా ఉందని గ్రహించి.. 106 మందికి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనీశ్ రెంగే తెలిపారు. అందులో 61 మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఒక వ్యక్తికి శుక్రవారమే కరోనా సోకిందని వివరించారు. బాధితుల్లో 41 మందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. 30 మందికి లక్షణాలు లేవని చెప్పారు. మరో ఐదుగురు అనుమానిత రోగులను సైతం ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. కరోనా సోకిన ఆశ్రమ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో.. ఒకటిన్నర ఏళ్ల వయసు ఉన్న బాలిక, గర్భిణీ ఉన్నారని చెప్పారు.
ఇదీ చదవండి: చెల్లెలిపై మూడు నెలలుగా అన్న అత్యాచారం.. చివరకు..