హరియాణా కర్నాల్ జిల్లా కుంజపురాలోని సైనిక్ స్కూల్లో కరోనా కలకలం రేగింది. ఏకంగా 54 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్టు నిర్ధరణ అయింది.
సోమవారం ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ఉన్న 390 విద్యార్థుల నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపించినట్లు చెప్పారు. అందులో 54 పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు.
కర్నాల్‌లో కరోనా సంక్రమణం అదుపులోకి వచ్చిన సమయంలోనే ఈ కేసులు వెలుగులోకి వచ్చాయని డా. యోగేశ్ శర్మ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.