ETV Bharat / bharat

52 ఏళ్ల వయసులో 26వసారి ఎవరెస్ట్​ అధిరోహణ - నేపాల్ న్యూస్​

Mount Everest Record: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్​ను 52 ఏళ్ల వయసులో 26సారి అధిరోహించి అరుదైన రికార్డు సృష్టించారు నేపాల్​కు చెందిన కామీ రీతా .

Mount Everest Record
Mount Everest Record
author img

By

Published : May 8, 2022, 4:52 PM IST

Mount Everest Record: నేపాల్​కు చెందిన 52 ఏళ్ల కామీ రీతా అరుదైన రికార్డును సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్​ను 26వ సారి అధిరోహించారు. దీంతో ఆయన రికార్డును ఆయనే తిరగరాశారని యాత్ర నిర్వాహకులు దవా షెర్పా తెలిపారు.

11 మంది సభ్యులతో కూడిన కామీ రీతా బృందం శనివారం సాయంత్రం 6:55 గంటలకు 8,848.86 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు. ఎవరెస్ట్ అధిరోహించే వారి కోసం తాడులు బిగించడానికి కామీ రీతా.. అంతకుముందే ఒకసారి ఈ సాహస యాత్రను పూర్తిచేశారు. 1953లో న్యూజిలాండ్​కు చెందిన సర్​ ఎడ్మండ్​ హిల్లరీ అధిరోహించిన సంప్రదాయ ఆగ్నేయ శిఖర మార్గం నుంచే ఈ యాత్రను పూర్తిచేశారు.

కొవిడ్​ కారణంగా 2020లో నిలిపివేసిన పర్వతయాత్రను నేపాల్​ ప్రభుత్వం తాజాగా పునఃప్రారంభించింది. ఈ ఏడాది 316 మంది పర్వతారోహకులకు అనుమతులు జారీ చేసింది నేపాల్​ పర్యటక శాఖ. కాగా ఎవరెస్ట్​ను ఇప్పటివరకు 10,567 సార్లు అధిరోహించారు. శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో చాలా మంది విజయవంతమవగా.. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా భారత్​కు చెందిన నారాయణన్ అనే పర్వాతారోహకులు​ ప్రాణాలు విడిచారు.

ఇదీ చదవండి: కాంచెన్‌జంగా పర్వతం అధిరోహిస్తూ భారతీయుడు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.