మహారాష్ట్రలో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 49,447 కొత్త కేసులు నమోద్యయాయి. 277 మంది వైరస్‌కు బలయ్యారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 55, 656కు పెరిగింది.
నగరాల్లో వైరస్ పంజా..
ముంబయిలో కొత్తగా 9,090 కేసులు వెలుగుచూశాయి. శనివారం 27 మంది మృతిచెందారు. పుణె, నాగ్‌పూర్ ప్రాంతాల్లోనూ వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
రాజధానిలో...
దిల్లీలో కొత్తగా 3,567 మంది వైరస్ బారినపడ్డారు. 10 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,647కు పెరిగింది.
కర్ణాటకలో తీవ్రరూపం
కర్ణాటకలో కొత్తగా 4,373 మందికి వైరస్ సోకింది. 19 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. బెంగళూరులో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది.
హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వైరస్ కట్టడికి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. విద్యాసంస్థలు అన్నీ ఏప్రిల్ 15 వరకు మూసివేసే ఉంచనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ చదవండి:మమత రోడ్ షోలో ఎద్దు వీరంగం