కర్ణాటక రాయిచూర్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. హూనూర్ గ్రామంలోని ఓ వ్యక్తి కొనుక్కున్న స్నాక్స్ ప్యాకెట్‌లో అక్షరాల రూ.500 నోటు దొరికింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా ఆశ్యర్యానికి గురయ్యారు. మొదట ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. అయితే ఆ తర్వాత కూడా కొంతమందికి అలానే డబ్బులు దొరకడం వల్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. దీంతో ఆ స్నాక్ ప్యాకెట్‌ను కొనేందుకు స్థానికులంతా ఆసక్తి చూపారు.
ఆ ప్యాకెట్‌ను కొనుగోలు చేసేందుకు గ్రామస్థులంతా దుకాణాలకు బారులు తీరారు. గ్రామస్థులు ఆ స్నాక్స్ ప్యాకెట్స్ కోసం ఎగబడటం వల్ల ఆ గ్రామంలో ఉన్న ప్యాకెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు గ్రామంలోని ఏ షాపులోనూ ఆ స్నాక్స్ ప్యాకెట్స్ దొరకడం లేదని ఓ దుకాణ యజమాని తెలిపారు.