పెగసస్ నిఘా వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణకు 500 మందికి పైగా వ్యక్తులు, సంస్థలు లేఖ రాశాయి. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓకు చెందిన ఈ స్పైవేర్‌ను భారత్‌లో విక్రయం, బదిలీ, వినియోగంపై మారటోరియం విధించాలని విజ్ఞప్తి చేశాయి.
మహిళా విద్యార్థిణులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు, లాయర్లు, లైంగిక హింస బాధితులపై నిఘా కోసం స్పైవేర్‌ను వినియోగించారనే కథానాలపై వారు విస్మయం వ్యక్తంచేశారు. లింగ భేదాల్లేని, సమాచార భద్రత, వ్యక్తిగత గోపత్య విధానాన్ని అనుసరించాలని కోరారు.
చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన వ్యక్తిపై ఈ సాఫ్ట్వేర్ ద్వారా నిఘా ఉంచారనే ఆరోపణలను కూడా ఈ లేఖలో ప్రస్తావించారు.
"పెగసస్ అనేది మహిళలకు సంబంధించి తీవ్ర ఆందోళనకరమైనది. ప్రభుత్వం, అధికారంలో ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడితే నిఘా ఉంటుందనే భయం వారిని వెంటాడుతుంది. మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రభుత్వ సైబర్ దాడులు.. లైంగిక వేధింపుల బాధితులనూ వదల్లేదు. ఇది సొంత ప్రజలపై ప్రభుత్వం చేస్తున్న దాడి." అని పేర్కొన్నారు.
ఈ లేఖపై అరుణ రాయ్, అంజలి భరద్వాజ్, హర్ష్ మందర్ సహా ఇతర కార్యకర్తలు, విద్యావేత్తలు, వ్రిందా గ్రోవర్, ఝుమా సేన్ లాంటి న్యాయవాదులు సంతకాలు చేశారు.
ఇదీ చూడండి: పెగసస్‌పై కేంద్రం, రాహుల్ మధ్య మాటల యుద్ధం!