గ్రామాల్లో సంచరిస్తూ క్రూరమృగాలు భయపెడుతున్నాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే.. హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో వీటి బెడద మరీ ఎక్కువైంది. గురువారం రాత్రి.. పాత బస్టాండ్ ప్రాంతంలోని తన ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారిని ఓ అడవి జంతువు (Wild animal attack Shimla) ఎత్తుకెళ్లింది. అది చిరుతేనని (Shimla leopard attack) అనుమానిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. వెంటనే రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టారు.
అర్ధరాత్రి నుంచి వెతికినా.. బాలుడి ఆచూకీ దొరకలేదు. ర్యాపిడ్, క్విక్ రెస్పాన్స్ దళాలు పోలీసులతో సంయుక్తంగా బాలుడిని వెతికే పనిలో పడ్డారు.
బాలుడితో పాటు ఉన్న మరో చిన్న పిల్లాడు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
శిమ్లాలో ఇలాంటి ఘటన జరగడం 3 నెలల్లో ఇది రెండోసారి. ఆగస్టులో ఇలాగే ఐదేళ్ల బాలికను చిరుత (Wild animal attack Shimla) ఎత్తుకెళ్లి చంపింది. అప్పటినుంచి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: దారుణం.. 9వ తరగతి బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం