ETV Bharat / bharat

బాల కానిస్టేబుల్.. 5 ఏళ్లకే గవర్నమెంట్ జాబ్.. ఎలాగంటే.. - 5 year old child constale in chhattisgarh

కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్న తండ్రి మరణంతో ఆ బాధ్యతల్ని తన ఐదేళ్ల కుమారుడికి అప్పగించారు ఛత్తీస్‌గఢ్ పోలీసులు. దీంతో ఆ బాలుడు చైల్డ్​ కానిస్టేబుల్​గా మారాడు.

5 yeras old child become constable in chattisgarh
ఛత్తీస్‌గఢ్​లో 5 ఏళ్ల చైల్డ్ కానిస్టేబుల్‌
author img

By

Published : Mar 24, 2023, 1:36 PM IST

Updated : Mar 24, 2023, 9:50 PM IST

కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి స్థానంలో అతడి ఐదేళ్ల కుమారుడిని చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించారు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు. దీంతో కేవలం ఐదేళ్ల వయసులోనే ఆ బాలుడు పోలీస్ కానిస్టేబుల్​గా మారాడు.

ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లాకు చెందిన నమాన్​ రాజ్​వాడే అనే 5 ఏళ్ల బాలుడు ప్రస్తుతం యూకేజీ చదువుతున్నాడు. అతడి తండ్రి రాజ్​ కుమార్​ రాజ్​వాడే కొన్నేళ్లుగా జిల్లాలోని ఓ స్థానిక మహిళా పోలీస్​ ఠాణాలో కానిస్టేబుల్​గా పని చేసేవారు. విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఓ రోడ్​ యాక్సిడెంట్​లో మరిణించారు రాజ్​కుమార్.

"నా భర్త కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన స్థానంలో నా కుమారుడిని చైల్డ్​ కానిస్టేబుల్​గా నియమించారు అధికారులు. కొంచెం బాధగా ఉంది. కానీ, నా బిడ్డ పోలీస్​గా మారబోతున్నందుకు సంతోషంగానూ ఉంది."
- నీతూ రాజ్‌వాడే, చైల్డ్​ కానిస్టేబుల్ తల్లి

పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛత్తీస్​గఢ్​ సర్గుజా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్​ పోలీస్ భావనా గుప్తా వెల్లడించారు.

"స్థానిక మహిళా ఠాణాలో కానిస్టేబుల్​గా పనిచేసేవారు రాజ్‌కుమార్ రాజ్‌వాడే. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన స్థానంలో అతడి ఐదేళ్ల కుమారుడు నమాన్​ రాజ్​వాడేను చైల్డ్​ కానిస్టేబుల్​గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. పోలీసు హెడ్‌క్వార్టర్స్ మార్గదర్శకాల ప్రకారం ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి కుటుంబంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగల వారు ఉంటే వారికి ఈ ఉద్యోగవకాశాన్ని కల్పిస్తారు."
-భావనా గుప్తా, సూపరింటెండెంట్ ఆఫ్​ పోలీస్

ఇప్పుడే పోస్టింగ్​ కానీ విధుల్లోకి మాత్రం..
చైల్డ్​ కానిస్టేబుల్​గా నియమితుడైన నమాన్​ రాజ్​వాడేకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు పోలీసులు. కానీ, నిబంధనల ప్రకారం ఆ బాలుడికి మైనారిటీ తీరిన తర్వాతే అంటే 18 ఏళ్లు నిండాకే పూర్తి స్థాయి విధుల్లోకి తీసుకోనున్నారు అధికారులు.
ఇలాంటి సంఘటనే మరొకటి కూడా ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోనే జరిగింది. ఈ ఏడాది జనవరిలో ఐదేళ్ల చిన్నారిని చైల్డ్​ కానిస్టేబుల్​గా నియమించింది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం. బాలుడి తండ్రి అకాలమరణం కారణంగా కారుణ్య నియామకం కింద ఆ చిన్నారికి ఈ ఉద్యోగం వచ్చింది. అతడికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే పూర్తి స్థాయి కానిస్టేబుల్​గా విధుల్లో చేరనున్నాడు. ఈ కథనం పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : Mar 24, 2023, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.