Girl raped in Puri: ఒడిశాలోని పూరీలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై ఇంటి పక్కన ఉంటే ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీంతో బాలికను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా కటక్‌లోని ఎస్సీబీ ఆసుపత్రిలో చేర్చించినట్లు పేర్కొన్నారు.
చిన్నారి.. పూరీలోని ఓ అద్దె ఇంట్లో తన కుటుంబంతో కలిసి ఉండేది. నిందితుడు మహేశ్ మహంతి కూడా అదే బజార్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబం ఇంటికి తరుచూ వచ్చి వెళ్లేవాడు. ఇలా వచ్చిన మహేశ్ ఇంట్లో ఎవరూ లేరని గమనించి చిన్నారిని డాబా మీదకు తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. మహేశ్ అక్కడ నుంచి పారిపోవడం స్థానికులు చూసినట్లు పేర్కొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:
బైక్ నడుపుతూ మృతి.. రాత్రంతా రోడ్డుపైనే శవం.. వారంతా చూసినా...