2020 జనవరి 1 నాటికి రాష్ట్రాలు, కేంద్ర స్థాయి పోలీసు శాఖకు సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీసు పరిశోధన అభివృద్ధి సంస్థ(బీజీఆర్డీ). దేశంలో వివిధ రాష్ట్రాల్లో 5,31,737 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లోనూ(సీఏపీఎఫ్) 1,27,120 ఖాళీలున్నాయని వెల్లడించింది. అయితే 2019లో ఆయా విభాగాల్లో మొత్తం 1,19,069 నియామకాలు జరిగాయని బీజీఆర్డీ తెలిపింది.
పెరిగిన మహిళల శాతం
భద్రత నిర్వహణలో మహిళల సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. గతంలో కేవలం 10.30 శాతం ఉన్న మహిళా బలగాలు.. గతేడాది జరిగిన నియామకాల ద్వారా 16.05 శాతానికి పెరిగినట్లు బీపీఆర్డీ తెలిపింది. అయితే సీఏపీఎఫ్లో మాత్రం 2.98శాతం మంది మహిళా పోలీసులే ఉన్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: 'ఈసారి చర్చలు విఫలమైతే రంగంలోకి దిగుతాం'