5 crore cryptocurrency fraud: క్రిప్టోకరెన్సీల పేరిట రూ.5 కోట్ల మోసాలకు పాల్పడిన ఇద్దరిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఓ మహిళ సైతం ఉందని పోలీసులు వెల్లడించారు. దెహ్రాదూన్‌లోని వికాస్‌నగర్‌కు చెందిన 11మంది.. నిందితుల చేతిలో మోసపోయారని తెలిపారు.
Uttarakhand cryptocurrency fraud
ప్రధాన నిందితుడు చండీగఢ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ కైలాశ్గా, మహిళను శటాక్షి శుభమ్‌గా గుర్తించారు పోలీసులు. వీరిద్దరినీ హైదరాబాద్‌లోని ఓ హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ట్రాన్సిట్ రిమాండ్ మీద ఉత్తరాఖండ్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ వివరాల ప్రకారం వికాస్ నగర్‌కు చెందిన కొందరు వ్యక్తులను.. మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో నిందితులు మోసాలు చేశారు. పలు కంపెనీలకు యజమానులమని చెప్పి.. 3-5 శాతం లాభాలు ఇప్పిస్తామని ఆశ చూపారు. క్రిప్టో కరెన్సీల ద్వారా భారీ లాభాలు పొందొచ్చనన్న ఆశతో రూ.5 కోట్లు నిందితుల వద్ద పెట్టుబడులు పెట్టారు. బాధితులు రూ.5 కోట్లను బదిలీ చేయగానే.. నిందితులు డబ్బుతో ఉడాయించారు.
వీరి మొత్తం మోసాలు రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: ఘరానా మోసాల కుటుంబం.. రూ.100 కోట్లకుపైగా టోకరా