ETV Bharat / bharat

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు- ప్రయాణికులు సేఫ్​

కన్నూరు- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెద్దప్రమాదం తప్పింది. పట్టాలపై బండరాళ్లు పడటం వల్ల ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Kannur-Bengaluru Express derailed
పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు
author img

By

Published : Nov 12, 2021, 10:39 AM IST

తమిళనాడులోని ధర్మపురి సమీపంలో కన్నూరు- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెనుప్రమాదం తప్పింది. ఏడు బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమమని, ఎవరికీ గాయాలు కాలేదన్నారు.

Kannur-Bengaluru Express derailed
పట్టాలు తప్పిన రైలు

గురువారం సాయంత్రం 6 గంటలకు కేరళ నుంచి బయలుదేరిన రైలు.. పట్టాలపై బండరాళ్లు పడటం వల్ల శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు తొప్పూరి- శివాడి మధ్య పట్టాలు తప్పింది.

Kannur-Bengaluru Express derailed
పట్టాలు తప్పిన కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు

సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను బెంగళూరు తరలించేందుకు తొప్పూరిలో 15 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపిన అధికారులు.. ఘటనా స్థలం వద్ద మరో ఐదు బస్సులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు నీరు, ఫలహారాన్ని అందించినట్లు తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఇదీ చూడండి: తీరం దాటిన వాయుగుండం.. జలదిగ్బంధంలో చెన్నై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.