ETV Bharat / bharat

బాలికపై 6 నెలల పాటు సామూహిక అత్యాచారం - అత్యాచారం వార్తలు

16 ఏళ్ల బాలికపై 6నెలల పాటు అత్యాచారం చేశారు ఐదుగురు యువకులు. ఎవరికైనా చెబితే ఆమె నగ్నంగా ఉన్న వీడియో వైరల్​ చేస్తామని బెదిరించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

5 boys raped 16 year old minor
బాలికపై సామూహిక అత్యాచారం
author img

By

Published : Jul 30, 2021, 10:08 AM IST

ఐదుగురు యువకులు.. 16 ఏళ్ల బాలికపై 6 నెలలపాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో జరిగింది. ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు.

ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్​, జబల్​పుర్​కు చెందిన బాలికపై.. ఆమె స్నేహితుడు అత్యాచారం చేశాడు. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోను స్నేహితులకు పంపించాడు. దీంతో వీడియోను వైరల్ చేస్తామని భయపెట్టి ఐదుగురు కలిసి బాలికను బెదిరించి 6 నెలలపాటు అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని, వీడియో బయటపెడతామని హెచ్చరించారు.

అయితే.. జరిగిన విషయాన్ని బాలిక.. తల్లితండ్రులకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు యువకులను అరెస్ట్​ చేసి.. వారిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: కాలకృత్యాలకు వెళ్లిన బాలిక​పై హత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.