ETV Bharat / bharat

'రూ.50వేలు ఇవ్వు.. లేదంటే ఆమెను చంపేస్తా'.. తల్లికి 4వ తరగతి విద్యార్థి లేఖ - పెద్ద కూతరిని చంపేస్తానని తల్లీకి కూతురి లెటర్

నాలుగో తరగతి చదివే ఓ పాప తల్లికి లెటర్​ రాసి​ 50 వేల రూపాయలు డిమాండ్​ చేసింది. ఇవ్వకపోతే తన పెద్ద కూతురిని చంపేస్తానని బెదిరించింది. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది.

4th class girl extortion letter to mother
తల్లికి లెటర్​ రాసి బెదిరించిన 4వ తరగతి చదివే కూతురు
author img

By

Published : Nov 16, 2022, 4:46 PM IST

చిన్నపిల్లలు తల్లిని బొమ్మలో, ఆట వస్తువులో అడుగుతారు. ఇక్కడ నాలుగో తరగతి చదివే ఓ పాప మాత్రం తల్లికి లెటర్​ రాసి​ 50 వేల రూపాయలు డిమాండ్​ చేసింది. ఇవ్వకపోతే నీ పెద్ద కూతురిని చంపేస్తానని బెదిరించింది. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది. సోమవారం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. మేఘా పాండే అనే మహిళ యూపీ కాన్పుర్​లోని మస్వాన్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో భర్త, ఇద్దరు పిల్లలతో కలసి నివసిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఆమెకు కొన్ని బెదిరింపు లేఖలు వస్తున్నాయి. 50వేల రూపాయలు ఇవ్వాలని, లేదంటే తన పెద్ద కూతురిని చంపేస్తామని ఆ లేఖల్లో ఉంది. దీంతో భయపడిపోయిన మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళ ఇంటికి దర్యాప్తు కోసం వెళ్లారు. వివిధ కోణాల్లో పరిశోధన చేసిన అనంతరం అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ బెదిరింపు లేఖలు రాస్తున్నది పాండే కూతురేనని నిర్ధరించారు. పాప చేతి రాత, నోట్​ పుస్తకాల ఆధారంగా ఈ విషయం తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు పాపను పశ్నించగా, తానే లెటర్లు రాసి గేట్​పై ఉంచేదాన్ని అని చెప్పింది. ఎవరైనా రాయమని చెప్పారా? అని అడగగా తానే సొంతంగా రాసినట్లు తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. చివరగా పాపకు ఇలాంటి పనులు ఇకముందు చెయ్యవద్దని చెప్పినట్లు వారు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.